నారా రోహిత్ నటిస్తున్న చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు. వృతి వాఘని, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్, అభినవ్ గోమఠం తదితరులు నటిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ చేతిలో మొక్క, మరో చేతిలో పుస్తకం పట్టుకొని కూల్ అండ్ క్లాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. సినిమా ఆసాంతం నవ్వులు పంచుతుంది. కథానుగుణంగా మంచి టైటిల్ కుదిరింది. సెప్టెంబర్ 6న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాతలు: సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి, రచన-దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి.