నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం సుందరకాండ. విర్తి వాఘని కథానాయిక. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మాతలు. నేడు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఏ రెండు ప్రేమకథలు ఒకేలా ఉండవు అని పోస్టర్‌పై ఉంది. ఇది వైవిద్యమైన ప్రేమకథ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, నరేశ్ విజయకృష్ణ. వాసుకి ఆనంద్ ఇతర పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: ప్రదీష్ ఎం.వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణం: సందీప్ పిక్చర్ ప్యాలెస్.