Namaste NRI

సుందరం మాస్టార్ .. ఫస్ట్ లుక్ విడుదల

తనదైన కామెడీ స్టైల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు హర్షచెముడు. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్‌ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీజర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

   తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ లాంఛ్ చేశాడు. బ్యాచ్‌ 2023 అని క్యాప్షన్‌ను పోస్టర్‌లో చూడొచ్చు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో కామెడీ టచ్‌ ఉండే పాత్రలో కనిపించే హర్ష చెముడు ఈ సారి ఎలాంటి కథాంశంతో రాబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది. ఈ మూవీకి దీపక్ ఎరెగ‌డ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events