Namaste NRI

ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సునీత

మాధురి గాయని సునీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో వందల పాటలు ఆలపించింది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఎంతో మంది హీరోయిన్లకు గాత్రం దానం చేసింది. గతకొన్ని రోజులుగా సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది. నేను ప్రెగ్నెంటా నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు అని సునీత చెప్పుకొచ్చింది.

 19ఏళ్ల వయసులోనే సునీత, కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు. సునీత కూతురు టాలీవుడ్‌లో సింగర్‌గా  రాణిస్తుంది. కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక రెండేళ్ల కిందట ప్రముఖ వ్యాపార వేత్త, మ్యాంగో మ్యూజిక్ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ రామకృష్ణ వీరపనేనిని వివాహం చేసుకుంది. 42ఏళ్లకు రెండో పెళ్లి చేసుకోవడంతో సునీత్ ఒక్క సారిగా హాట్ టాపిక్ అయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events