అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో సునీతా విలియమ్స్ చిక్కుకున్న విషయం తెలిసిందే. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన ఆమె, బోయింగ్ స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ సమస్య వల్లే 8 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఆ స్పేస్ స్టేషన్కు కమాండర్గా మారింది సునీతా విలియమ్స్. రష్యా కాస్మోనాట్ ఓలెగ్ కోనెనెంకో ఆ కమాండ్ను సునీతాకు అప్పగించినట్లు నాసా ప్రకటించింది. కమాండర్ బాధ్యతలు అప్పగింత సమయంలో స్పేస్ స్టేషన్లో ఓ సెర్మనీ కూడా జరిగింది. కోనెనెంకో స్పేస్ స్టేషన్కు వెళ్లి ఏడాది కావోస్తోంది. అతని తో పాటు ట్రేసీ డైసన్, నికోలయి చుబ్లు కూడా త్వరలో భూమికి తిరిగిరానున్నారు. స్పేస్ స్టేషన్లోని మైక్రోగ్రావిటీ ల్యాబ్లో సునీతా వర్క్ చేస్తున్నది. మానవ, రోబోటిక్ మిషన్స్కు చెందిన టెక్నాలజీపై ఆమె సైంటిఫిక్ స్టడీ చేస్తున్నది. స్పేస్ స్టేషన్ కమాండ్ను సునీతా స్వీకరించడం ఇది రెండోసారి. 12 ఏళ్ల క్రితం కూడా ఆమె ఆ బాధ్యతలు నిర్వర్తించారు. స్పేస్ స్టేషన్లో భద్రతను చూసుకోవడమే ఆమె కీలక బాధ్యత అవుతుంది.