అత్యధిక సమయం స్పేస్వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ రికార్డ్ సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలపాటు స్పేస్వాక్ చేశారు. ఆమె బుచ్ విల్మోర్తో కలిసి 2024 జూన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ స్పేస్వాక్ చేశారు.
అంతరిక్షంలో సూక్ష్మజీవులు ఉన్నాయేమో చూసి, వాటి నమూనాలను సేకరించడం కోసం వీరు తామున్న ప్రయోగశాల నుంచి బయటకు దిగారు. ఈస్టర్న్ టైమ్ ప్రకారం ఉదయం 7.43 గంటలకు ప్రారంభమైన వీరి స్పేస్వాక్ మధ్యాహ్నం 1.09 గంటలకు ముగిసింది.
విలియమ్స్కు ఇది తొమ్మిదో స్పేస్వాక్ కాగా, విల్మోర్కు ఐదోది. ఇదివరకటి మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్స్ మొత్తం స్పేస్వాక్ సమయం 60 గంటల 21 నిమిషాలు కాగా, ఆ రికార్డును విలియమ్స్ అధిగమించారని నాసా వెల్లడించింది. నాసా ఆల్టైమ్ లిస్టులో విలియమ్స్ నాలుగో స్థానాన్ని సాధించారు.