
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్ (ISS)తో విజయవంతంగా అనుసంధానమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు వచ్చే సమయాన్ని నాసా తాజాగా ప్రకటించింది. ఈనెల 18 అంటే మంగళవారం సాయంత్రం 5:57 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వారు భూమ్మీద ల్యాండ్ కానున్నట్లు తెలిపింది. ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకురానున్నట్లు నాసా ప్రకటించింది.
