Skip to main content

Namaste NRI

తెలుగులో సూపర్‌డీలక్స్‌

విజయ్‌సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, సమంత ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం సూపర్‌డీలక్స్‌.  తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కుమార రాజా దర్శకత్వం వహించారు. నాలుగు కథల సమాహారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 9న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి ట్రాన్స్‌జెండర్‌ క్యారెక్టర్‌లో కనిపించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసల దక్కాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా సంగీతాన్నందించారు. నిర్మాతలు: దైవసిగమణి, తీర్థమలై, పూల మధు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events