Namaste NRI

సూపర్ హీరో ఇంద్రాణి టీజర్ వచ్చేసింది

యానియా భరద్వాజ్ ప్రధాన పాత్రలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్వకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇంద్రాణి. గరీమా కౌశల్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను హీరో మంచు విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఇలాంటి ఒక కొత్తతరం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చిత్ర బృందానికి నా అభినందనలు. నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి అన్నారు. వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథతో రూపొందిన సూపర్ హీరో చిత్రమిది. పోరాట ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తక్కువ సమయంలోనే అద్భుతమైన విజువల్స్ అందించేందుకు శ్రమిస్తున్న వీఎఫ్ఎక్స్ బృందానికి కృతజ్ఞతలు అన్నారు చిత్ర దర్శక నిర్మాత స్టీఫెన్. యానియా భరద్వాజ్, ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, కబీర్ సింగ్, షతాప్ ఫిగర్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహా నిర్మాతలు : సుధీర్ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్ మాధవనేని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events