సత్యరాజ్, అశ్విన్స్, వసంత్వ్రి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ వెపన్. మిలియన్ స్టూడియో పతాకంపై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. సత్యరాజ్ మాట్లాడుతూ ఈ కథలో నటీనటుల కంటే సాంకేతిక నిపుణులే కీలకం. దానికి తగ్గట్టే మంచి టీమ్ కుదిరింది. దర్శకుడు గుహన్ సరికొత్త విజన్‌తో సినిమాను ఆవిష్కరించాడు.
బాహుబలి కంటే ఇందులోనే ఎక్కువ యాక్షన్ సీన్లలో నటించాను. ఫైట్ మాస్టర్ జాగ్రత్తలు తీసుకోవడంతో సేఫ్‌గా ఉన్నాను అన్నారు. ఇదొక సూపర్‌హీరో సినిమా అని, కథ ప్రకారం ఆ సూపర్‌హీరో సత్యరాజ్‌గారేనని నటుడు వసంత రవి చెప్పారు. డీసీ, మార్వెల్ తరహా సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో వెపన్ ని తెరకెక్కించాం. నా గురువు రాజీవ్ మీనన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో సత్యరాజ్‌గారు ఇచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. కేరళలోని వాగమన్‌లో వండర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు తీశాం. నటీనటులంతా రిస్క్ తీసుకొని నటించారు” అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మన్సూర్, పీవీఆర్ హెడ్ మీనా, తాన్యా హోప్, రాజీవ్ పిైళ్లె తదితరులు పాల్గొన్నారు.