తేజ సజ్జా కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం హను-మాన్. అమృత అయ్యర్ కథానాయిక. ఈ చిత్రంలో వినయ్‌రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ చిత్రంలోని ఓ పాటను బాలలదినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. సూపర్‌హీరో హనుమాన్ అంటూ సాగే ఈ పాట సంగీత పరంగానే కాక, విజువల్ ప్రెజెంటేషన్ కూడా అద్భుతంగా ఉంటుందని, సూపర్‌హీరోలను ఇష్టపడే పిల్లలకోసం నిజమైన సూపర్‌హీరో హనుమాన్ సూపర్ పవర్ చూపించటానికే బాలల దినోత్సవం రోజు ఈ పాటను విడుదల చేశామని మేకర్స్ చెప్పారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అనుదీ్‌పదేవ్ స్వరాలందించగా, వాగ్దేవి, ప్రకృతి, మయూఖ్ హృద్యంగా ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలోనే కాక ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, నిర్మాత: కె.నిరంజన్‌రెడ్డి.














