ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు చర్చలు ముగిసిన కాసేపటికే అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎంబసీ సిబ్బంది రష్యాను వీడేందుకు అనుమతిచ్చింది. రష్యాతో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. కాగా భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడిరచింది. మాస్కోలోని తమ రాయబార కార్యాలయానికి చెందిన నాన్` ఎమర్జెన్సీ సిబ్బంది, కుటుంబ సభ్యులను స్వచ్ఛందంగా వెనక్కి రావాలని ఆదేశించింది.