సూపర్‌గర్ల్ కథాంశంతో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిస్తున్న ఇంద్రాణి చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు నరేష్ క్లాప్‌నివ్వగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సూపర్‌గర్ల్ ఇంద్రాణి చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించబోతున్నాం. యానియా భరద్వాజ్ ఇంద్రాణి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకుంది అని తెలిపారు. యానియా భరద్వాజ్, కబీర్‌సింగ్, ప్రణీత జిజిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్ : చోటా కె ప్రసాద్, ఆర్ట్: రవికుమార్ గుర్రం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: స్టాన్లీ సుమన్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం : స్టీఫెన్. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.














