విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హత్య. బాలాజీ కుమార్ దర్శకుడు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ప్రీరిలీజ్ ను వేడుకను నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన అడివి శేష్ మాట్లాడుతూ హత్య ట్రైలర్ చూస్తుంటే ఇంటర్నేషనల్ సినిమాలా ఉంది. విజయ్ ఆంటోని స్వశక్తితో ఎదిగారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నేను డిటెక్టివ్ పాత్రను పోషించాను. ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఈ సినిమా థ్రిల్‌ను పంచుతుంది అని చెప్పారు.
1923లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. వినూత్నమైన థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది అని దర్శకుడు తెలిపారు. విజయ్ ఆంటోని ఎంచుకున్న కథలు చాలా కొత్తగా ఉంటాయని హీరో సందీప్ కిషన్ చెప్పారు. ఈ సినిమాలో తాను లైలా పాత్రలో అలరిస్తారని కథానాయిక మీనాక్షి చౌదరి పేర్కొంది. ఈ నెల 21న విడుదల కానుంది.