ప్రముఖ జర్నలిస్ట్, సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సంతోషం అవార్డ్స్ కార్యక్రమానికి ఆహ్వానించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన సురేష్ కొండేటి, ఈ అవార్డుల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించారు. సినీ పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే చంద్రబాబు, ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు చిత్ర పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహిస్తాయని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై ఆయన సానుకూలంగా స్పందించారు.

గత 24 ఏళ్లుగా సినీ పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహించడానికి సంతోషం మ్యాగజైన్ అవార్డులను అందిస్తోంది. ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ మరియు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.















