దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) కోసం సినీ అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకులముందుకు రానుంది. దీపావళి కానుకగా పోరాట సన్నివేశాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా వీడియోలో వీరిద్దరి మధ్య చోటుచేసుకునే పోరాట ఘట్టాలతో పాటు సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్ని చూపించారు. కీరవాణి నేపథ్య సంగీతం ఈ వీడియోకు ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో అలియాభట్, ఒలీలియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 450 కోట్ల భారీ వ్యయంతో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)