అగ్ర హీరో ప్రభాస్ కజిన్ విరాట్‌రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం గౌడ్‌సాబ్. డ్యాన్స్ మాస్టర్ గణేష్ దర్శకుడు. శ్రీపాద ఫిల్మ్స్ పతాకంపై ఎస్‌ఆర్ కల్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయి కృష్ణ కార్తీక్ నిర్మిస్తున్నారు. అగ్ర దర్శకుడు సుకుమార్ టైటిల్ లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. సుకుమార్ మాట్లాడుతూ గణేష్ చక్కటి ప్రతిభావంతు డు.జగడం చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. తను చేసే ప్రతి పాటలో ఓ కథ ఉంటుంది. ఇప్పుడు దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. అంత బాగా నచ్చింది అన్నారు. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. డ్యాన్స్ మాస్టర్‌గా నన్ను ఎంతగానో ఆదరించారు. దర్శకుడిగా కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా అని గణేష్ తెలిపారు. యాక్షన్ హంగులు కలబోసిన ప్రేమకథా చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌ఎమ్ స్వామి, సంగీతం: వెంగి, ఆర్ట్: బేబీ సురేష్ భీమగాని, రచన-దర్శకత్వం: గణేష్ మాస్టర్.