నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం తండేల్. సాయిపల్లవి కథానాయిక. చందు మొండేటి దర్శకత్వం. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మించారు. నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నాగ చైతన్య మాట్లాడుతూ మేమంతా సినిమా చూశాం. చాలా సంతోషంగా ఉన్నాం. చివరి ముప్పై నిమిషాలు సినిమా పీక్స్లో ఉంటుంది. అంచనాలకు మించి ఆశ్చర్యపరుస్తుంది. ఈ పాలి యేట గురితప్పలేదు. రేపొద్దున రాజులమ్మ జాతరే అని అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చందు సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారు అని చెప్పారు. చందు మొండేటి మాట్లాడుతూ ప్రేమికుల ఎడబాటు, తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురు చూపు, ఆ మనిషి తనకోసం వస్తాడనే నమ్మకం, ఇలా చాలా బ్యూటీఫుల్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి అని అన్నారు. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ పాకిస్థాన్ సీక్వెన్స్ కోసం డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేశారు అని చెప్పారు.