Skip to main content

Namaste NRI

తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. శరణాగతి

ఇస్కాన్‌ వ్యవస్థాపక ఆచార్యులైన పరమ పావన శ్రీల ప్రభుపాదుల జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం శరణాగతి. ది లైఫ్‌ ఆఫ్‌ ఎ సెరెండర్డ్‌ సోల్‌ అనేది ఉపశీర్షిక. హోంబలే ఫిల్మ్స్‌, ట్రాన్స్‌సెండెంటల్‌ ఫిల్మ్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈచిత్రానికి గౌరశక్తిదాస దర్శకుడు. రాజేశ్‌సింగ్‌, లోహిత్‌రావు నిర్మాతలు. శ్రీధర్‌ శికారిపుర విజువల్‌ డైరెక్టర్‌. అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాటజీని ఈ సినిమాకోసం ఉపయోగించనున్నట్టు మేకర్స్‌ తెలిపారు.ఏఐ, కంప్యూటర్‌ విజన్‌ టెక్నాలజీలను కలిపి మనుషుల కదలికలను డిజిటల్‌ యానిమేషన్‌గా మార్చే ఆధునిక సాంకేతికత ఈ యానిమేషన్‌ పాత్రలకు మరింత సహజత్వం తీసుకొస్తుందని వారు తెలిపారు.

భగవద్గీతలోని శాశ్వతమైన బోధనలు, శ్రీకృష్ణసందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో 1965లో తన 69వ ఏట శ్రీల ప్రభుపాదులు మనదేశం నుంచి అమెరికాకు ప్రయాణం ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి కృష్ణచైతన్య సందేశాన్ని చేరవేసే మహోద్యమంగా మారిన ఈ ప్రస్థానానమే ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్‌ తెలిపారు. ఈ అచంచలమైన విశ్వాసం, శరణాగతి, పట్టుదల, నిస్వార్థ సేవకు శ్రీల ప్రభుపాదుల జీవితం గొప్ప నిదర్శనమని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని మేకర్స్‌ చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events