సూర్యతేజ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం భరతనాట్యం. సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్ అని ఉపశీర్షిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పీఆర్ ఫిల్మ్స్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్నారు. మీనాక్షీ గోస్వామి కథానాయిక. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.క్రైమ్ కామెడీ కథాంశమిది. ఈ సినిమా కథకు, భరతనాట్యానికి సంబంధం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టామో తెలియాలంటే టీజర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్‌ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, సంగీతం: వివేక్ సాగర్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, కథ: సూర్యతేజ, దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర.