Namaste NRI

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫియర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

వేదిక లీడ్‌రోల్‌ చేసిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫియర్‌. అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషించారు. డా.హరిత గోగినేని ఈ చిత్రానికి దర్శకురాలు. డా.వంకి పెంచలయ్య, ఏఆర్‌ అభి నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ ను హీరో మాధవన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ని ఆయన అభినందించారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. మనసిక సమస్యలతో బాధపడుతున్న సింధుగా వేదిక ఇందులో కనిపించింది. ఎవరో తనను వెంటాడుతున్నట్టు భయపడుతుంటుంది. ఎవరు ధైర్యం చెప్పినా ఆమెను ఫియర్‌ వదలదు. చికిత్స కోసం సింధుని హాస్పిటల్‌లో చేర్చారు. అసలు సింధుని వెంటాడుతున్నది ఎవరు? ఆమె ఎందుకు భయపడు తున్నది? అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్‌ చివర్లో వేదిక ద్విపాత్రాభినయంలో కనిపించ డం థ్రిల్‌కి గురిచేసింది. జెపి(జయప్రకాష్‌), పవిత్రలోకేష్‌, అనీష్‌ కురువిల్ల, సాయాజి షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress