ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సర్వసన్నద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉద్రికత్తలు పెరిగిపోతుండడంతో ఆ దేశానికి వెళ్లే విమానాలను నిలిపివేయడంతో పాటు కొన్ని విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థలు వేరే ప్రాంతాలకు మళ్లిస్తున్నాయి. డచ్ ఎయిర్‌లైన్ కెఎల్‌ఎం తదుపరి నోటీసులు దాకా ఉక్రెయిన్‌కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఉక్రెయిన్ గగనతలం మీదుగా తమ విమానాలను నిలిపివేస్తున్నటు ఉక్రెయిన్‌కు చెందిన స్కైఆప్ ఎయిర్‌లైన్స్‌ను అద్దెకు తీసుకున్న ఐరిష్ సంస్థ ప్రకటించడంతో పోర్చుగల్‌లోని మదీరానుంచి కీవ్‌కు వచ్చే విమానాన్ని మాల్డోవన్ రాజధాని కిసినావు మళ్లించినట్టు ఆ సంస్థ తెలిపింది. దీంతో ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు వచ్చే వారు పలు విమానాశ్రయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)