Namaste NRI

స్వాతిముత్యం రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

గణేష్‌ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న సినిమా స్వాతి ముత్యం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్‌ కె కృష్ణ దర్శకుడు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 5న ఈ  చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాత వెల్లడిరచారు. దర్శకుడు లక్ష్మణ్‌ కె. కృష్ణ మాట్లాడుతూ జీవితం, ప్రేమ, పెళ్లి వంటి విషయాల పట్ల స్వాతి ముత్యం లాంటి ఓ యువకుడి ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా సాగాయి అనేది సినిమాలో చూపిస్తున్నాం అన్నారు. అనంతరం సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ప్రేమతో కూడిన వినోదభరిత కుటుంబ కథా చిత్రమిది.  కుటుంబ సమేతంగా చూసేలా లక్ష్మణ్‌ చక్కగా తీశారు అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, కెమెరా: సూర్య, సమర్పణ : పీడీవీ ప్రసాద్‌, కూర్పు: నవీన్‌ నూలి, కళ : అవినాస్‌ కొల్లా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events