గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ లక్ష్మణ్ చెప్పిన స్వాతిముత్యం కథ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మూను. ఈ సినిమా అద్భుతంగా రావడానికి ప్రధాన కారణం వంశీగారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అన్నారు. స్వాతిముత్యం రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదు.. కొత్త పాయింట్ ఉంది. నన్ము నమ్మి అవకాశం ఇచ్చిన నాగవంశీ అన్నకు థ్యాంక్స్ అన్నారు లక్ష్మణ్ కె.కృష్ణ. నాయిక వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ స్వాతిముత్యం సినిమా మీ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు. కొత్త ప్రతిభకు పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశమివ్వడమనేది చాలా పెద్ద విషయం. గణేష్‌కు ఇది తొలి చిత్రమైనా చాలా అద్భుంగా చేశారు. తను పడిన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. పండగకి సరిపోయే కుటుంబ కథా చిత్రమిది. అందుకే దసరాకి విడుదల చేస్తున్నాం అన్నారు నిర్మాత నాగవంశీ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)