కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న చిత్రం మ్యాడ్ స్కేర్ . సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్‌లో భాగంగా లడ్డుగాని పెళ్లి అంటూ ఈ సినిమా నుంచి విడుదలైన తొలి గీతానికి విశేషమైన స్పందన లభించిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు.
తాజాగా స్వాతి రెడ్డి అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సురేశ్ గంగుల సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడమే కాకుండా స్వాతిరెడ్డితో కలసి ఆలపించారు. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ పాటలో హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌లతో పాటు రెబా మౌనికా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలచిందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: సూర్యదేవర నాగవంశీ.