Namaste NRI

స్వాతిముత్యం రిలీజ్ డేట్ ఫీక్స్

గణేష్‌ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం స్వాతిముత్యం. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది.  ఈ సందర్భంగా విడుదల తేదీతో ఓ కొత్త లుక్‌ను నెట్టింట పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో గణేష్‌, వర్ష స్కూటీపై సరదాగా రైడ్‌ చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ సకుంటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రమిది. జీవితం, ప్రేమ, పెళ్లి.. వంటి అంశాల మధ్య స్వాతిముత్యం లాంటి ఓ కుర్రాడి జీవన ప్రయాణం ఎలా సాగిందన్న ఆసక్తికరం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది అని  తెలిపారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది అన్నారు. లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్టు 13న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వీకే సురేష్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  సంగీతం: మహతి స్వర సాగర్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సూర్య. ఆర్ట్‌: అవినాస్‌ కొల్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events