గణేష్ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్ కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో ప్రచార పర్యాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా డుం డుం డుం మోగింది మేళం అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు మహతి స్వర సాగర్ బాణీలు కట్టగా కృష్ణకాంత్ సాహిత్యమందించారు. ఆదిత్య అయ్యంగార్, అరుణ్, లోకేష్ ఆలపించారు. చిత్ర కథాంశం ప్రకారం నాయకానాయికల మధ్య వచ్చే పెళ్లి గీతమిది. వారి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు జరిగే వివిధ వ్యవహారాల్ని ఈ పాటలో చక్కగా చూపించాం. సహజత్వం ఉట్టి పడేలా ఈ ఈ గీతాన్ని చిత్రీకరించాం. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. అని చిత్ర దర్శకుడు లక్ష్మణ్ చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సూర్య. దసరా శుభాకాంక్షలతో స్వాతిముత్యం ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)