Namaste NRI

స్విట్జర్లాండ్‌లో స్విస్ గణేశా మహోత్సవ్ – ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

స్విట్జర్లాండ్‌లోని ఎన్నారైలు స్విస్ గణేశా మహోత్సవ్ -2023 పేరిట గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ గణనాథుని ప్రతిష్టించి పిల్లలు, పెద్దలు అందరు శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

స్నికిత, జస్మితా, కీర్తన, తన్మయి, అదితి, ఆంశిక, అక్షిత, నేహా, లేఖన, అమూల్య, తదితరులు తమ నాట్య ప్రదర్శనతో అలరించారు. భరతనాట్యం, కథక్, మొహినియాట్టం, సినిమాటిక్ డాన్స్ లాంటి కళా రూపాలు ప్రదర్శించారు. చిత్రలేఖనం, గాత్రం పోటీలను నిర్వహించి పిల్లలకు బహుమతులు అందించారు.

స్విస్ తెలుగు రైజింగ్ స్టార్స్ గ్రూప్ పిల్లలు ప్రదర్శించిన ‘విగ్నేశ్వర జన్మరహస్యం’ నాటకం ఈ ఉత్సవాలకు హైలైట్‌గా నిలిచి పోయింది. ఈ కార్యక్రమంలో స్విస్ తెలుగు కార్యవర్గం అధ్యక్షుడు పద్మజా రెడ్డి, సెక్రటరీ నాగరాజ్ గుమ్మాల, డివోషనల్ సెక్రటరీ సౌమ్య కొత్తపల్లి, ఆధ్యాత్మిక పర్యవేక్షకుడు పవన్ దుద్దిళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో తెలుగు వారే కాకుండా ఇతర రాష్ట్రాల ఎన్నారైలంతా దాదాపు 300 మందికి పైగా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events