Namaste NRI

స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… సూసైడ్‌ క్యాప్సూల్‌ పై   

స్విట్జర్లాండ్‌  ప్రభుత్వం క్షణాల్లో ప్రాణాలు తీసేసే సూసైడ్‌ క్యాప్సూల్‌ను నిషేధించింది. ఎగ్జిట్‌ స్విట్జర్లాండ్‌ అనే కంపెనీ సార్కోఫాగస్‌ పేరుతో ఈ మెషీన్‌ను తయారుచేసింది. కారుణ్య మరణం పొందాలనుకునే వారి కోసం దీనిని తయారుచేశారు. ఈ మెషీన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని దీనిని తయారుచేసిన డాక్టర్‌ ఫిలిప్‌ నిట్స్‌ఖే జూన్‌ 10న ప్రకటించారు.అయితే, ఈ సూసైడ్‌ క్యాప్సూల్‌ వల్ల దుష్పరిణామాలు ఉంటా యని భావించిన స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. ఏదైనా భరించలేనంత అనారోగ్య సమస్య ను అనుభవిస్తున్న వారు సులువుగా కారుణ్య మరణం పొందేందుకు ఈ క్యాప్సూల్‌ ఉపయోగపడు తుందని దీనిని తయారుచేసిన కంపెనీ చెప్తున్నది.

ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు ఈ క్యాప్సూల్‌లో కూర్చోగానే మెషీన్‌,  ఎవరు నువ్వు?, ఎక్కడ ఉన్నావు?, ఈ బటన్‌ నొక్కితే ఏమవుతుందో తెలుసా? అనే మూడు ప్రశ్నలు అడుగుతుందని డాక్టర్‌ ఫిలిప్‌ చెప్తున్నారు. ఈ ప్రశ్నలకు వారు సమాధానాలు చెబితే మెషీన్‌ ప్రారంభమవుతుందని, అప్పుడు బటన్‌ నొక్కవచ్చని తెలిపారు. బటన్‌ నొక్కిన 30 సెకన్లలో ఇందులో ఆక్సిజన్‌ శాతం 21 నుంచి 1 శాతానికి పడిపోయి క్షణాల్లో మనిషి మరణిస్తాడని చెప్పారు. అయితే, ఈ క్యాప్సూల్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో నిషేధిస్తూ స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress