రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కావ్ అరోరా జంటగా నటించిన చిత్రం సైదులు. కేఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై మరబత్తుల బ్రహ్మానందం నిర్మిస్తున్నారు. బాబా పీఆర్ దర్శకుడు. హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేశారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాస్తవికతని ప్రతిబింబించే సినిమా ఇది. ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అన్నారు. దర్శకుడు బాబా పీఆర్ మాట్లాడుతూ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఓ ఊరి జనం చేసిన తిరుగబాటు నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించాం. 80వ దశకంలో జరిగిన కథను చూపిస్తున్నాం. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. త్వరలోనే సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్ ప్రసు, సినిమాటోగ్రఫీ : పీఎస్ మణికర్ణన్.














