టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆరంభ మ్యాచ్‌లో ఒమన్ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేసింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకముందే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆ జట్టును ఛార్లెస్ (37)తో కలిసి కెప్టెన్ అసద్ 56, 43 బంతుల్లో 4/4, 3/6) ఆదుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 81 పరుగులు జత చేయడంతో జట్టు కోలుకున్నట్లే కనిపించింది. కానీ తిరిగి పుంజుకున్న ప్రత్యర్థి బౌలర్లు ఆ తర్వాత 16 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి జట్టును కట్టడి చేశారు. ఒమన్ కెప్టెన్ జీషన్ (4/20) బంతితో చెలరేగాడు. అనంతరం ఛేదనలో భారత సంతతి కుర్రాడు జతిందర్ (73 నాటౌట్, 42 బంతుల్లో 7/4, 4/6)తో పాటు మరో ఓపెనర్ అకీబ్ (50 నాటౌట్, 43 బంతుల్లో 5/4,1/6) కూడా అజేయ అర్థశతకాలతో సత్తా చాటడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఒమన్ 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)