Namaste NRI

టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల

క్రికెట్‌ అభిమానులు అత్రుతగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. భారత్‌లో జరగాల్సిన ఈ టోర్నీ.. కరోనా కారణంగా వేదిక మారిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఒమన్‌తో పాటు యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు.  అక్టోబర్‌ 24న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు దుబాయ్‌లో  భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభమవుతుందని ఐసీసీ ప్రకటించింది.  బుదాబిలో నవంబర్‌ 10న తొలి సెమీస్‌, దుబాయ్‌లో 11న రెండో సెమీస్‌ ఉంటాయి. నవంబర్‌ 14 దుబాయ్‌లో ఫైనల్‌ పోర్టు ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వు డేలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress