
ముంబై ఉగ్రవాద దాడుల కేసులో దోషి తహవుర్ రాణాకు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనను భారత దేశానికి పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇక ఆయనను భారత దేశానికి రప్పించడానికి మార్గం సుగమం అయింది.
