తైవాన్ మంత్రి హూ మింగ్ చున్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈశాన్య భారత్‌కు చెందిన ప్రజల్ని వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని, ఎందుకంటే వాళ్ల చర్మ రంగు, ఆహార అలవా ట్లు తమలాగే ఉంటాయని ఆ మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఎక్కువగా క్రైస్తవులు అని, వాళ్లు ఉత్పత్తి, నిర్మాణం, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తుంటారని ఆమె అన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు హూ వెల్లడించారు. తైవాన్ కార్మిక విధానాలు సమానత్వాన్ని కోరకుంటాయన్నారను. వివక్ష ఉండదన్నారు. స్థానికులైనా, విదేశీ వర్కర్లు అయినా ఒక్కటే అన్నారు. వలస కూలీల రిక్రూట్మెంట్‌లో చర్మ రంగు, జాతికి ప్రాధాన్యత ఇవ్వవద్దు అని తైవాన్ నేత చెన్ కువాన్ టింగ్ పేర్కొన్నారు. మంత్రి హూ మింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ దేశ కార్మిక శాఖ సోమవారం క్షమాపణలు జారీ చేసింది.