Namaste NRI

నిర్మాత లగడపాటి శ్రీదర్ విడుదల చేసిన టేక్‌ డైవర్షన్‌ ట్రైలర్

శివ కుమార్‌, పాటినీకుమార్‌, గాయత్రి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం టేక్‌ డైవర్షన్‌. రామచంద్రన్‌, జాన్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను లగడపాటి శ్రీధర్‌  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైటిల్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. ముగ్గురు అన్నదమ్ములు కలిసి నిర్మిస్తున్న చిత్రం కాబట్టి మంచి పాజిటివ్‌ వెబ్స్‌ ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్టై వీరు మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నా అన్నారు.  నిర్మాత చందు మద్దాల మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అని తెలిపారు. అన్ని రకాల వాణిజ్య హంగులూ పుష్కలంగా  ఉన్నాయి. సెంథిల్‌ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా ఉంది అన్నారు. మద్దాల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌ మద్దాల, చందు మద్దాల, వెంకట్‌ మద్దాల నిర్మిస్తున్నారు. శివానీ సెంథిల్‌ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఉమర్జీ అనురాధ, రాజేష్‌ సూరిశెట్టి, గౌతం కశ్యప్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events