రష్యా వ్యాపార, రాజకీయవేత్త విక్టర్ మెద్వెచక్ను ఉక్రెయిన్ అరెస్టు చేసింది. ఉక్రెయిన్ మిలిటరీ దుస్తులు ధరించి, చేతులకు బేడీలతో ఉన్న మెద్వెచక్ ఫోటోను రిలీజ్ చేశారు. మెద్వెచక్ను తీసుకువెళ్లి తమ ఆధీనంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలను రిలీజ్ చేయాలని పుతిన్‌ను జెలెన్స్కీ కోరారు. మెద్వెచక్ సంపన్న వ్యాపారవేత్త. పుతిన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే రష్యా అధ్యక్ష భవనంతో లింకులు అవసరమున్న నేపథ్యంలో మెద్వెచక్తో ఇన్నాళ్లూ ఉక్రెన్ సత్ సంబంధాలను కొనసాగించింది. కాగా ఉక్రెయిన్ చర్యపై రష్యా ఘాటుగా స్పందించింది. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది. అతనిని పట్టుకున్నవారు త్వరలో నిర్బంధించబడతారని వార్నింగ్ ఇస్తూ.. కీవ్ ప్రతిపాదనను తిరస్కరించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)