రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతార. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ కథానాయిక. కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఫారెస్ట్ నేపథ్యంలో విష్ణు తత్వాన్ని ఈ సినిమాలో గొప్పగా ఆవిష్కరించారు. రిషబ్‌శెట్టి అద్భుతమైన నటనతో పాటు దర్శకత్వ ప్రతిభను కనబరిచారు. విభిన్న కథా చిత్రాల్ని ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ అడవి నేపథ్యంలో సాగే ఓ మిస్టరీ కథతో రూపొందిన చిత్రమిది. వ్యవసాయ భూమితో ముడిపడి ఉండే భావేద్వేగాలతో మిళితమై ఉంటుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అన్నారు. సప్తమిగౌడ, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్, సంగీతం: అజనీష్ లోకనాథ్. ఈ కార్యక్రమంలో సప్తమి, రాంబాబు గోసాల పాల్గొన్నారు.
