ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ త్వరలోనే రష్యా పర్యటనకు వెళ్లుతున్నారు. ఈ విషయాన్ని రష్యా, ఉత్తరకొరియాలు అధికారికంగా నిర్థారించాయి. అత్యంత విలాసవంతమైన ప్రైవేటు రైలులో కిమ్ రష్యా ప్రయాణానికి సన్నాహాలు తలపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకాకి అవుతోన్న రష్యాకు ఉత్తర కొరియా బాసటగా నిలవడంపై పశ్చిమ దేశాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉత్తరకొరియా అధ్యక్షులు కిమ్ సుదీర్ఘ చర్చలకు అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య చాలా పటిష్ట స్థాయి ఆయుధ ఒప్పందం కుదురుతుందని, ఇది ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని మరింత ఎగదోస్తుందని అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు విశ్లేషిస్తున్నాయి. పుతిన్ ఆహ్వానంపై కిమ్ రాబోయే కొద్దిరోజులలో మాస్కోకు వస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార వెబ్‌సైట్ ద్వారా సంక్షిప్త ప్రకటన వెలువడింది.