హారర్ కామెడీ సినిమాలు తీయడంలో దర్శకుడు సుందర్.సి.ది ప్రత్యేకశైలి. తమిళంలో ఆయన దర్శకత్వం లో రూపొందిన అరణ్మనై ఫ్రాంఛైజ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. ఈ ఫ్రాంఛైజ్‌లో నాలుగో సినిమా అరణ్మనై 4 ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో బాక్ అనే పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు ఖుష్బు సుందర్, ఏసీఎస్ కుమార్. సుందర్.సి. హీరోగా నటించి, దర్శకత్వం వహించి న ఈ సినిమా లో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలో పంచుకో అటూ సాగే ఓ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
సాహితీ రాసిన ఈ గీతాన్ని హిపాప్ తమిళా స్వరపరచగా, రాఘవి హస్కీ వాయిస్‌లో ఆలపించారు. ఈ పాటకు చెందిన వీడియో గురించి మేకర్స్ చెబుతూ తమన్నా, రాశీఖన్నాల గ్లామర్ ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. వారి గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ట్రెండీ లుక్‌లో ఇద్దరూ అదరగొట్టేశారు. కథలోని కొన్ని ఎక్సయింటింగ్ సన్నివేశాలను కూడా ఇందులో కలపడంతో చూసినవారంతా బావుందని అభినందిస్తున్నారు అని తెలిపారు. వెన్నెల కిశోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్, కోవై సరళ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఇ.కృష్ణమూర్తి అకా కిచ్చ.