రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకుంది. రాజకీయ కోణంలో సాగే యాక్షన్ చిత్రమిది. ఇందులో సూర్య పాత్ర కీలకం. ఆయన పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండనుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో చరణ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరిష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: కార్తీక్ సుబ్బరాజు, సంగీతం: తమన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)