నితిన్ హీరోగా శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రధారులు. ఈ నెల 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. హీరో నితిన్ మాట్లాడుతూ ఈ సినిమా శ్రీరామ్ వేణు కోసం, నా సినిమాలను ఇష్టపడే అభిమానులు, నాకు సక్సెస్ రావాలని కోరుకునేవారి కోసం ఘన విజయం సాధించాలి. నా గత చిత్రాలు మీకు ఆనందాన్ని కలిగించలేదు. కానీ ఈ సినిమా తప్పకుండా సంతోషపెడుతుంది. నా గత సినిమాలు నిరాశపర్చాయి. ఇక నుంచి మంచి స్క్రిప్ట్స్‌తో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఇది థియేట్రికల్‌గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని తెలిపారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ మూవీ అవుట్ పుట్ ఇంత బాగా రావడానికి టెక్నీషియన్స్ కష్టమే కారణం. డీవోపీ గుహన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్, ఆర్ట్ చేసిన శేఖర్, ఇలా టెక్నీషియన్స్ శ్రీరామ్ వేణు విజన్‌ను స్క్రీన్ మీదకు అద్భుతంగా తీసుకొచ్చారు. జై బగళాముఖీ పాటతో మా సినిమాకు ఒక వైబ్ వచ్చింది. ఆ పాట రాసిన జొన్నవిత్తులకి థ్యాంక్స్. అజనీష్ లోకనాథ్ తన మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నితిన్ గత కొన్ని చిత్రాలు సక్సెస్ కాలేదని బాధలో ఉన్నాడు. కానీ తమ్ముడు ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మా బ్యానర్‌కు మరో హిట్ ఈ సినిమా ఇవ్వబోతోంది. రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ చేశాం. చరణ్‌తో సూపర్ హిట్ చేయలేకపోయామనే లోటు ఉంది. త్వరలోనే ఆయనతో ఓ సూపర్ హిట్ మూవీ చేయబోతున్నాం అని అన్నారు.















