ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డిట్రాయిట్‌లో వైభవంగా నిర్వహించనున్న తానా 24వ మహాసభలకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరోవైపు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ మహాసభలను పురస్కరించుకుని వివిధ రకాల ఆటల పోటీలను తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి పర్యవేక్షణలో నిర్వహిస్తోంది. కమ్యూనిటీని మహాసభల్లో భాగస్వామ్యం చేసేందుకు వీలుగా జరిగే ఈ పోటీల్లో అందరూ పాల్గొనాలని తానా నాయకులు కోరారు.

1.చెస్ టోర్నమెంట్‌ను మే 3వ తేదీన నోవీలోని స్పార్క్ ఎరీనాలో నిర్వహిస్తోంది.
2.మెగా క్రికెట్ టోర్నమెంట్ ను మే 24,25,26 తేదీల్లో మిచిగన్ లోని వెస్ట్ బ్లూమ్ ఫీల్డ్ టౌన్ షిప్‌లోని డ్రేక్స్ స్పోర్ట్స్ పార్క్ లో ఏర్పాటు చేసింది.
4.వాలీబాల్ టోర్నమెంట్‌ను జూన్ 7,8 తేదీల్లో నిర్వహిస్తోంది. నోవీలోని స్పార్క్ ఎరీనాలో ఈ పోటీలు జరగనున్నది.
5.గోల్ఫ్ టోర్నమెంట్ ను జూలై 3వ తేదీన నిర్వహిస్తోంది.
