అంగరంగ వైభవంగా జరిపిన ‘తానా – సాంస్కృతిక కళోత్సవాలు’ కు అద్భుత స్పందన.విజయవాడ KL యూనివర్సిటీలో ‘తానా’చైతన్య స్రవంతి’వారి ‘తానా – సాంస్కృతిక కళోత్సవాలు’, ‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ – సునీల్ పంత్ర మరియు ‘తానా’కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్, ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త రాజా కసుకుర్తి సమన్వయంలో, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారథ్యం లోవందలాది మంది కళాకారుల నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగాయి.
‘తానా’చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ – సునీల్ పంత్ర మాట్లాడుతూ , డిసెంబరు 2, 2022 వ తేదీ నుంచి జనవరి 7, 2023 వరకు 100 కు పైగా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు భాగాలు గా చేయడానికి తల పెట్టాము అనీ, అవి … సేవ లో భాగంగా- మెడికల్, హెల్త్, విద్యా, గ్రామీణ సదుపాయాలు, మినరల్ వాటర్ ప్లాంట్స్, రైతు రక్షణ లాంటి కార్యక్రమాలు …మరియు తానా కళోత్సవాలు – సంగీత, నృత్య, జానపద, సాంస్కృతిక కళలు ప్రోత్సాహం.
వంటి కార్యక్రమాలు మరికొన్ని అన్నారు. మాకు KL యూనివర్సిటీ ఆడిటోరియం ఇచ్చిన యాజమాన్యం మరియు పూర్తి సహకారం అందించిన భార్గవ్ గారుకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు! KL యూనివర్సిటీ యాజమాన్యం ‘తానా’ చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్లప్పుడు ముందుండి చేయూతను అందిస్తున్న వారి ఉదారతను మేము ఎల్లపుడు మరచిపోము అని అన్నారు.
‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్ మరియు ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త – రాజా కసుకుర్తి – మాట్లాడుతూ …సభకు విచ్చేసిన ముఖ్య అతిథి డా. రమేష్ పోతినేని గారికి, వేదికను అలంకరించిన ‘తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ఠ కళాకారులకు స్వాగతం పలికి, కళా ప్రదర్శనలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షిస్తున్న అందరికీ శు�