తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో కొవిడ్ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా సేకరించిన పంపించిన సుమారు రూ.11 కోట్ల విలువైన రక్షణ సామగ్రి మంటల్లో కాలిపోయింది. గతేడాది డిసెంబరులో కెనడా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సామగ్రి దిగుమతి చేసుకున్నట్లు సొసైటీ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్ చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సరకు తీసుకురావడానికి, ఇక్కడ గోదాములో భద్రపరచడానికి అవసరమైన అనుమతుల్లో జాప్యం వల్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. ఈ విషయాన్ని తానా సభ్యుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. విశాఖపట్నం పెదగంట్యాడలో శ్రావణి షిప్పింగ్ గోదాములో అగ్నిప్రమాదంలో శానిటైజర్లు, గ్లౌజులు, మాస్క్‌లు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి.
