Namaste NRI

కొప్పాక లో రైతు కోసం తానా

రైతులకు వ్యవసాయ రంగంలో చేయూత నివ్వాలనే దిశలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రైతు కోసం తానా అనే కార్యక్రమాన్ని కీ. శే శ్రీ డి.వి. చలపతి రావుగారి స్మారకార్ధం వారి సతీమణి శ్రీమతి నారేసాలెపు సునీత గారి సహకారంతో 21 కొప్పాక లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గౌ” శాసన సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు హాజరయ్యారు. పంట దిగుబడిని పెంచడానికి ప్రతిభావంతంగా పనిచేసే విధంగా 10 Power Sprayer లను మరియు 10 Tarpaulins ను కొప్పాక పెదకడిమి మరియు రామచంద్ర పురం గ్రామాలకు చెందిన పేద రైతులకు సే|| శాసన సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరియు గ్రామ పెద్దలు ప్రముఖుల చేతులమీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కొప్పాక గ్రామ సర్పంచ్ శ్రీ దీక్షితులు గారు పెదకడిమి సర్పంచ్ బలరామకృష్ణ చౌదరిగారు తానా సభ్యులు మేకా సతీష్ గారు  గ MEO శ్రీ అరుణ్ గారు HM శ్రీమతి శైలజ గారు ఎాఠశాల ఉపాధ్యాయులు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

సుధీర్ నారెపలుపు మరియు సతీష్ మెకా అధ్వర్యంలొ జరిగిన కార్యక్రమానికి సహకరించిన తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గారికి, రైతుకొసం కమిటీ సభ్యులు రమణ అన్నె గారికి, జానయ్య కొట గారికి, అనిల్ యలమంచలి గారికి, వెంకట్ కొసరాజు గారికి, ప్రసాద్ కొల్లి గారికి, వీరలెనిన్ తాల్లురి గారికి, ప్రెమ కొమ్మరెడ్డీ గారికి, శ్రినివాస్ యలమంచి గారికి, సుధాకర్ బొడ్డూ గారికి గ్రామస్తులు అభినందనలు తెలియచెసినారు. గౌరవ శాసనసబ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తానా కార్యవర్గాన్ని, తానా గ్రామాలలొ రైతులకి చెస్తున్న సెవలను ప్రసంచించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress