Namaste NRI

తానా “అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు” కార్యక్రమానికి శ్రీకారం

అమెరికా లో ఆరు రాష్ట్రాల సమ్మేళనం న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం, ఆ న్యూ ఇంగ్లండ్ లో, తానా  వా రి “అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు “కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు, ఈ కార్యక్రమంతో కొత్త తరానికి నాంది పలికారు, ఈ కార్యక్రమంలో భాగం గా తానా  బోస్టన్ సమీపంలో ఉన్న,వెస్ట్‌బరో లైబ్రరీకి అనేక పుస్తకాలను అందించింది.ఆంగ్ల తెలుగు నిఘంటువు, వేమన పద్యాలు, చందమామ కథలు, పెద్ద బాల శిక్ష మరియు మరెన్నో పుస్తకాలను పంపిణీ చేశారు, భవిష్యత్తులో న్యూ ఇంగ్లాండ్‌లో తెలుగు పుస్తకాలు అనేక లైబ్రరీలలో తానా అందుబాటులోకి తెస్తుంది.

 తెలుగు మాతృభాషా ప్రజలందరూ తెలుగు భాషను కాపాడుకోవడానికి అందరము నడుం బిగించాలి, తెలుగు భాషను, మన సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఎదో చేసాం అని వొరవడి కాకుండ తన వంతు సహాయం గా తెలుగు భాష పిల్లలుకు  చిన్నపుడు నుంచీ శ్రద్ధ కలిపించాలి. తెలుగు పిల్లలందరికీ తెలుగు భాషలోని మాధుర్యాన్ని నేర్పించాలి. “నా కుటుంబం నా తెలుగు” లాంటి మనస్తత్వం నేర్పించాలి.

మాతృభాష మాధుర్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు వివరించగలరు. రాయప్రోలు సుబ్బారావు గారి ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని… నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ని స్ఫూర్తి గ తీసుకోవాలి.

తెలుగు భాష కోసం ఎందరో పండితులు, విద్వాంసులు, ఉపాధ్యాయులు తమ జీవితాన్నంతా ధార చేశారు తెలుగు గురించి వారి బోధనలన్నీ చాలా విలువైనవి, వెల కట్టలేనివి, పర బాష పర భాషే మాతృ భాష మాతృత్వానికి నిదర్శనం. ఈ లైబ్రరీలో మీకు అవసరమైన తెలుగు పుస్తకం దొరకకపోతే మరియు ఎవరికైనా తెలుగు పుస్తకం కావాలంటే దయచేసి తానా ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ గడ్డం ని www.tana.org ద్వారా సంప్రదించండి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events