ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆహ్వానం అందింది. తానా సభ్యులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలైలో నిర్వహించనున్న 23వ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరారు. సదస్సుకు ఆహ్వానించిన తానా సభ్యులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. జూలై 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ 23వ తానా మహా సభలు జరుగనున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-145.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-142.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-195.jpg)