ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), నార్త్ కరోలినా రాలే తానా టీమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన నార్త్ కరోలినాలోని ఫుక్వాయ్ వారినా లో ఉన్న బేకర్ టౌన్ కాంప్లెక్స్ ఎఫ్‌విఎఎ ఫీల్డ్స్‌లో నిర్వహించిన తానా మెగా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతమైంది. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ, తమ ప్రతిభను చాటేందుకు పలువురు క్రీడాకారులు ఇందులో పాల్గొని సత్తా చాటారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలవరకు ఈ టోర్నమెంట్ సాగింది. 8 మందితో కూడిన టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ లో విజేతగా కాంకరర్స్ టీమ్ నిలిచింది. రన్నర్స్ గా ట్రైడెంట్ జట్టును ప్రకటించారు. బెస్ట్ బౌలర్‌గా వంశీ కృష్ణ నార్నె, బెస్ట్ బ్యాట్స్ మెన్ గా అభివర్ష్ పెద్దిరెడ్డి, ఎంవిపిగా యశ్వంత్ నాగండ్ల, బెస్ట్ అంపైర్ ఉపేంద్ర నిమ్మల ఎంపికయ్యారు.



ఈ టోర్నెమెంట్‌ను విజయవంతం చేసిన వారందరికీ, రాలే తానా టీమ్‌కు తానా అప్పలాచియాన్ రీజినల్ రిప్రజెంటేటివ్ రాజేష్ యార్లగడ్డ ధన్యవాదాలు తెలిపారు. తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఈ టోర్నమెంట్ లో ఆడిన ఆటగాళ్ళను అభినందించారు. అలాగే గ్రౌండ్ ఏర్పాట్లు మరియు లాజిస్టిక్స్‌ని నిర్వహించినందుకు వినోద్ కాట్రగుంటకు, వంశీ కట్టా, మిథున్ సుంకర, ప్రకాష్ ప్రణాళికలు, నియమాలను రూపొందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ రామకృష్ణ అల్లు, తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని తదితరులు పాల్గొన్నారు.



