Skip to main content

Namaste NRI

తానా (TANA) మిడ్ అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్’ కార్యక్రమం విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీమ్ తాజాగా నిర్వహించిన విల్ అండ్ ట్రస్ట్ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. దాదాపు 100 మందికిపైగా కుటుంబాలు తమ విల్ అండ్ ట్రస్ట్ పత్రాలను తమ భవిష్యత్తు కు భద్రత కల్పించుకోవడంతో పాటు తమ సంతతి వారికి ఉప యోగపడేలా చేసుకున్నాయి. ఎస్టేట్ ప్లానింగ్ ప్రాముఖ్యత పై కూడా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. విల్ మరియు ట్రస్ట్ వంటి ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి తెలిసింది. ఈ కార్యక్రమం ద్వారా పలు సేవలను తానా టీమ్ అందించింది. నిపుణుల సలహాలు, ఉచిత నోటరీ సేవలు, ఉచిత డాక్యుమెంట్ ప్రింటింగ్, ఇతరత్రా సేవలను అందజేసింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తమ మార్గదర్శకత్వాన్ని, నిరంతర సహకారాన్ని అందించిన తానా నాయకత్వ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓస్టన్, తనిష్క్ యుఎస్ ఎ, స్ప్రింగ్ ఈగిల్స్ సంస్థలకు ఇతరులకు తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.

Social Share Spread Message

Latest News