ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ యువ వాలంటీర్లు అద్భుత చరిత్ర సృష్టించారు.వాలంటీర్లు స్థానికంగా 8 వారాల పాటు నిర్వహించిన ఆహార సేకరణ కార్యక్రమంలో, 30కి పైగా పరిసర ప్రాంతాల నుంచి 7,000 పౌండ్ల పైచిలుకు (3,200 కేజీలు) ఆహారాన్ని సేకరించి స్థానిక ఫుడ్ బ్యాంక్‌లకు విరాళంగా అందజేశారు.


ఈ అద్భుత కార్యక్రమంలో 350 మందికి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. 1,500 పైచిలుకు సర్టిఫైడ్ వాలంటీర్ సర్వీస్ అవర్స్ నమోదయ్యాయి. తానా చరిత్రలోనే కాకుండా, ఈ ప్రాంతంలోనే ఇది అతిపెద్ద యువ స్వచ్ఛంద కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. తానా మిడ్-అట్లాంటిక్ యువత నాయకత్వ పటిమకు, అంకితభావానికి, సేవా దృక్పథానికి రికార్డు స్థాయిలో సాగిన ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది. వాలంటీర్లకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, మార్గదర్శకులకు, కమ్యూనిటీ నాయకులకు తానా పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు.


కోర్ టీమ్ సభ్యులు గోపి వాగ్వాల, వ్యోమ్ క్రోతపల్లి, సోహన్ సింగు, ధీరజ్ యలమంచి, క్రిషిత నందమూరి, అపర్ణా వాగ్వాల, సుజిత్ వాగ్వాల, ప్రణవ్ కంతేటి, లౌక్య పావులూరి, కేతన్ మామిడి, టియానా పటేల్, శ్రుతి కోగంటి, శ్రీకర్ కస్తూరి, మేధ యాగంటి, సితార నడింపల్లి, ఆర్నవ్ కంతేటి తోపాటు నైబర్‌హుడ్ కోఆర్డినేటర్లు ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు.


తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని నేతృత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు, మిడ్-అట్లాంటిక్ బృందం మొత్తం కలిసికట్టుగా సేవా నిబద్ధతతో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.


















